ప్రగతిలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు

UPDATED 5th JUNE 2018 TUESDAY 7:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఎకోక్లబ్, ఎన్విరాన్ మెంటల్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ర్యాక్ సిరామిక్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎన్విరాన్ మెంటల్ అండ్ హెల్త్ సేఫ్టీ హెడ్ ఎమ్.ఎస్.ఆర్. గోపాల్, హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ఈ సందర్భంగా తమ కళాశాలలో బీట్ ప్లాస్టిక్ పోల్యుషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి ముఖ్య అతిథి చేతులు మీదుగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన గోపాల్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో స్టాస్టిక్ వాడకం పర్యావరణానికి ఎంతో హాని చేస్తుందని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం ద్వారా భావితరాలను రక్షించవచ్చునని పేర్కొన్నారు. అనంతరం కళాశాలలో ఎకో క్లబ్ ప్లాస్టిక్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని పి. శ్రావణి, ఎన్. ప్రశాంతి, ఎస్. భార్గవి, ఎకో క్లబ్ విద్యావాలంటీర్లు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్.వి. హరనాధ్ బాబు(డైరక్టర్ మేనేజ్ మెంట్), డా. జి. రఘురామ్(డైరక్టర్), ఎమ్. సతీష్ (వైస్ ప్రెసిడెంట్), కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. శంభూప్రసాద్, డా. కె. సత్యనారాయణ (వైస్ ప్రిన్సిపాల్), డా. జి. నరేష్ (డీన్ అడ్మిన్), డా. పి.వి.ఎస్ మాచిరాజు (డీన్ ఆర్ అండ్ డి), వివిధ విభాగాధిపతులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us