వీర్యంతో కోట్లు సంపాదిస్తున్నాడు

రెడ్ బీ న్యూస్ 24 నవంబర్ 2021: విక్కీ డోనర్ అనే సినిమాని దాదాపుగా అందరూ చూసే ఉంటారు. ఇక ఈ సినిమాలో హీరో ఏకంగా వీర్యాన్ని అమ్ముకుని డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఇలా ఎంతో మందికి తన స్పెర్మ్ ని డొనేట్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు హీరో. ఇక ఇదే సినిమాని తెలుగులో నరుడా డోనరుడా అనే పేరుతో తెరకెక్కించారు. కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకర్షించే లేకపోయింది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా వీర్యాన్ని విక్రయించి రెండు కోట్ల రూపాయలను సంపాదిస్తూ ఉండటం గమనార్హం. ఏంటి వీర్యాన్ని విక్రయించడం ద్వారా కూడా అంత పెద్ద మొత్తంలో సంపాదించవచ్చ.. అలాంటి ఆఫర్లు కూడా ఉంటాయా అని ఆశ్చర్య పోతున్నారు కదా. అయితే సదరు వ్యక్తి విక్రయిస్తుంది మనిషి వీర్యాన్ని.. కాదు ఏకంగా ఒక దున్నపోతు వీర్యాన్ని. దున్నపోతు వీర్యాన్ని విక్రయిస్తూ ప్రతియేటా రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి. దున్నపోతు వీర్యానికి ఎంత గిరాకీ ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. కానీ ఇది నిజమే నండోయ్. అయితే అతని వద్ద దేశంలోనే అత్యంత ఖరీదైన దున్నపోతు ఉంది. ఏకంగా దున్నపోతు విలువ 24 కోట్ల రూపాయలు. ఇక దున్నపోతుకు భీమ్ అనే ఒక పేరు కూడా ఉంది. ఇక ఈ దున్నపోతు నుంచి యజమాని ఏకంగా వీర్యాన్ని అమ్మి ప్రతి ఏటా రెండు కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు అన్న విషయం ఇటీవల వెల్లడించాడు. ప్రస్తుతం ఈ దున్నపోతుకు యజమానిగా ఉన్నాడు అరవింద్ జంగిడ్ అనే వ్యక్తి. అయితే ఈ దున్నపోతు 14 ఫీట్ల పొడవు 6 ఫీట్ల ఎత్తు ఉంటుంది. భారీ సైజులో ఉన్న ఈ దున్నపోతు వీర్యంతో పుట్టిన గేదెలు పెద్ద అయిన తర్వాత దాదాపు 20 నుంచి 30 లీటర్ల పాలు ఇస్తాయి అందుకే ఎంతోమంది ఇక ఈ దున్నపోతు వీర్యాన్ని విక్రయించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారట. ఇలా దున్నపోతు వీర్యానికి భారీగా డిమాండ్ ఉండడంతో కేవలం వీర్యాన్ని విక్రయించి ఏకంగా రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు దున్నపోతు యజమాని. అయితే ఇక ఈ భారీ దున్నపోతు రోజూ కిలో నెయ్యి, అర కేజీ వెన్న, రెండు వందల గ్రాముల తేనె, 25 లీటర్ల పాలు,, కేజీ జీడిపప్పు తింటుందని దీని యజమాని చెబుతున్నాడు. ఇక దీని అవసరాలకు దాదాపు నెలకు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుందని అంటున్నాడు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us