TS News: ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022 : ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యమయ్యారు. పయోభారంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పరమపదించారు. టీటీడీ ఆస్థాన
శాశ్వత పండితుడిగా చంద్రశేఖర శాస్త్రి ప్రసిద్ధి. పురాణాలను శాస్త్రబద్ధంగా చెబుతూ ఎందరో ఆస్తికులకు ధర్మ మార్గాన్ని చూపించారు. 1925 ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో చంద్రశేఖర శాస్త్రి జన్మించారు. పురాణ ప్రవచనాలలో ఆయనకు ఆయనే సాటి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ వేడుకల ప్రత్యక్ష వ్యాఖ్యానాలలో ఆయన ఉషశ్రీతో కలిసి పాల్గొన్నారు. భారతము ధర్మసూక్ష దర్శనము, క్రుష్ణలహరి (స్వేచ్ఛాంధ్రానువాదము), రామాయణ రహస్య దర్శిని తదితర గ్రంథాలను రచించారు. వేదాలు, శ్రాతస్మార్త, వ్యాకరణతర్క వేదస్త సాహిత్యాలను చదివారు.

ఉపరాష్ట్రపతి సంతాపం..

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి పరమపదించటం విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక దృక్పథాల సమ్మేళనంగా సాగిన వారి ప్రవచనాలు జనులకు మార్గనిర్దేశనం చేసేవని ట్విటర్‌లో పేర్కొన్నారు. మల్లాది కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

బాధ కలిగించింది : పవన్

ప్రముఖ పండితులు, ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి ఇకలేరన్న వార్త తనకు బాధ కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమంలో శాస్త్రిగారు చెప్పే విశేషాలు ప్రతి తెలుగు వ్యక్తికీ చిరపరిచితమేనని గుర్తు చేసుకున్నారు. పురాణ, ఇతిహాస, వేద విశేషాలు అందరికీ అర్థమయ్యేలా. అధ్యాత్మిక చింతన పెంచేలా ఆయన ఉపన్యాసాలు సాగేవన్నారు. ధర్మ సందేహాలు, ధర్మ సూక్ష్మాలు కార్యక్రమల ద్వారా హిందూ ధర్మంపై అవగాహన పెంచారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. చంద్రశేఖర శాస్త్రి కుటుంబానికి తన తరపున, జనసేన పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us