దంత వైద్య విద్యార్థినికి ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు

విజయవాడ (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022 : విజయవాడ దంత వైద్య కళాశాల విద్యార్థినిని ఓ అసొసియేట్‌ ఫ్రొఫెసర్‌ లైంగికంగా వేధించిన ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. బాధిత విద్యార్థిని మూడు రోజులు కిందట విజయవాడ మాచవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు సమాచారం. విచారణ చేస్తామని కళాశాల ప్రిన్సిపల్‌ హామీ ఇవ్వడంతో ఆమె వెనుదిరిగారు. అనంతరం డీఎంఈకి ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం దంతవైద్య కళాశాలలో ముగ్గురు వైద్య బృందంతో అంతర్గత విచారణ చేపట్టారు. బాధితురాలితో పాటు, పలువురు విద్యార్థినులను విచారించారు. ఈ ఘటనపై విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ యుగంధర్‌ను సంప్రదించగా, విద్యార్థిని ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, అంతర్గత విచారణ చేపట్టామని, డీఎంఈకి నివేదిక అందజేస్తామని వెల్లడించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us