TS News: ఇంటర్‌ ఫస్ట్‌ఇయర్‌ ఫలితాల అంశంపై త్వరలో నిర్ణయం: వినోద్‌ కుమార్‌

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021‌: ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని, త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఇంటర్‌ ఫలితాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని, గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారని అభిప్రాయపడ్డారు. కరోనా విపత్తు వేళ పాఠశాల విద్యలో అభ్యసన నష్టాలపై రాష్ట్ర రికగ్నైజ్డ్‌ పాఠశాలల యాజమాన్యాల సంఘం ట్రస్మా, నీసా నిర్వహించిన సర్వేపై వినోద్‌ కుమార్‌ మాట్లాడారు. ఆన్‌ లైన్‌ బోధనతో గ్రామీణ విద్యార్థులకు నష్టం జరిగిందని అన్నారు. కరోనా వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే విద్యా సంవత్సరాన్ని పూర్తిగా కేటాయించాలని పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యసన ప్రక్రియలో జరిగిన నష్టం పూడ్చకపోతే .. రానున్న పదేళ్లపాటు దాని ప్రభావం ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి విద్యార్థులను ఈ సమస్య నుంచి గట్టెక్కించాలన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us