దర్జాగా దోచేశారు

UPDATED 24th JUNE 2017 SATURDAY 11:30 AM

పెద్దాపురం: ఇంట్లో అందరు ఉండగానే దొంగలు పడి విలువైన సామాగ్రిని, నగదును దోచేసిన సంఘటన పెద్దాపురం మండలం జె. తిమ్మాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాలచర్ల వీరభద్రరావు ఇంట్లో ఈ సంఘటన జరిగింది. ఇంట్లో అందరు నిద్రిస్తుండగా ఇంటి వెనుక ద్వారం గుండా లోపలికి దొంగలు ప్రవేశించి దోచేశారు. ఐతే ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో దొంగలకు పని సులువయ్యింది. ఇంట్లో బీరువాలో ఉన్న లాకర్ ను పగలకొట్టి ఎనిమిది కాసుల బంగారం, రూ.1.25 లక్షల నగదు, వెండి సామాగ్రిని దొంగలు దోచేశారు. వీటి విలువ సుమారు రూ.మూడు లక్షలు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ అక్కడకు చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. అలాగే క్లూస్ టీం రంగంలోకి దిగింది. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తుని ప్రారంభించారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us