Ambati Rambabu : ప్రత్యేక హోదా తొలగింపు వెనుక చంద్రబాబు:అంబటి రాంబాబు

UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 10:59 PM

అమరావతి: ఏపీ విభజన సమస్యలపై ఈ నెల 17న త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసే సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని అజెండాలో చేర్చి మళ్లీ తొలగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. సడెన్ గా.. కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఎందుకు మారిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి త్రిసభ్య కమిటీ పరిధిలోకి తీసుకొచ్చిన 9 అంశాలను మార్చాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రకటన చేశారని అంబటి మండిపడ్డారు.

ఏపీకి అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని చేరిస్తే.. జీవీఎల్ ఎందుకంత హడావిడి పడ్డారని ప్రశ్నించారు. దీనిపై జీవీఎల్ నరసింహారావు వివరణ ఇవ్వాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. హోం మంత్రిత్వ శాఖ వేసిన కమిటీకి తన ఎజెండా ఏమిటో తనకే తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఎజెండాలో ప్రత్యేక హోదా ఉండటాన్ని టీడీపీ ఎందుకు స్వాగతించలేదని రాంబాబు నిలదీశారు. సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లు చంద్రబాబు ఆదేశాలతోనే ఎజెండాను మార్పించారని స్పష్టం అవుతోందని అంబటి రాంబాబు ఆరోపించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us