అమరజీవికి పాత్రికేయుల నివాళి

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్)1 నవంబర్ 2021: ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దాపురం ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) అధ్యక్షుడు పచ్చిపాల ప్రసాదరావు ఆధ్వర్యంలో స్థానిక కంచర్ల వీధిలో ఉన్న స్వర్గీయ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి సోమవారం నివాళులర్పించారు. దీనిని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయం వెనుక గల మహాత్మాగాంధీ మున్సిపల్ స్కూల్లో ఉన్న భవిత కేంద్రంలో విభిన్న ప్రతిభావంతులకు సుమారు 25 మందికి పండ్లు, బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్లు మొదలైనవి పంపిణీ చేశారు. ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మొల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీ రాములు త్యాగం ఫలితంగానే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యక్షులు పచ్చిపాల ప్రసాదరావు ఆర్ధిక సహకారంతో భవిత కేంద్రంలో కిట్లు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమన్నారు. సీనియర్ పాత్రికేయులు రాకుర్తి రాంబాబు, ఎన్.పి.ఎస్ వినాయక్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలకు తమ వంతు సహాయసహకారాలు ఎల్లపుడూ ఉంటాయని తెలిపారు. కార్యదర్శి చవ్వాకుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పాసిల ప్రసాద్, కోశాధికారి బద్ది కుమార్, న్యాయ సలహాదారు ఎన్.శ్రీరామ్ కార్యవర్గ సభ్యులు సిద్ధాంతపు సుబ్బారావు, ఎస్.కె అప్సర మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన, చేపట్ట బోయే కార్యక్రమాలకు తాము ఎల్లపుడూ ముందుంటామన్నారు. అధ్యక్షులు ప్రసాదరావు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సహాయ సహకరాలతో ఇటువంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా తన తోటి ప్రింట్ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాత్మగాంధీ మున్సిపల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎమ్.ఎల్.శివజ్యోతి, భవిత సహిత ఉపాధ్యాయులు దుర్గాప్రసాద్ రెడ్డి, బి.ఆనందరావు, ఫిజియోతెరపిస్టు వి.అపర్ణ, దేవి, విద్యార్థుల తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us