కిక్ బాక్సింగ్ లో గైట్ విద్యార్థుల ప్రతిభ

UPDATED 4th MAY 2018 FRIDAY 8:00 AM

రాజానగరం: సౌత్ ఇండియా స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ -2018 కిక్ బాక్సింగ్ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి విజయదుందుభి మ్రోగించారని గైట్ మేనేజింగ్ డైరెక్టర్ శశికిరణ్ వర్మ తెలిపారు. ఈ పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులను కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు తుమ్మల శివప్రసాద్, 65 కేజీల విభాగం, తురిమెళ్ళ మనోజ్ ఆనంద్ 78 కేజీల విభాగం, తమరాన మౌనిక 55 కేజీల విభాగాలలో బంగారు పతకాలు సాధించగా, 57 కేజీల విభాగంలో బి. అలేఖ్య  వెండి పతకం సాధించారని అన్నారు. అలాగే గైట్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన కీర్తి నాగేశ్వరావు 57 కేజీల విభాగంలో వెండి పతకం, వై. యశ్వంత్ సాయి 48 కేజీల విభాగంలో, కంచర్ల జ్యోత్స్నాదేవి 50 కేజీల విభాగంలో బంగారు పతకాలు, 64 కేజీల విభాగంలో ఎస్.ఆర్.ఎన్. మూర్తి కాంస్య పతకం సాధించారన్నారు. తమ కళాశాలలకు చెందిన ముగ్గురు విద్యార్థులు తుమ్మల శివ ప్రసాద్, తురిమెళ్ళ మనోజ్, ఆనంద్, కంచర్ల జ్యోత్స్నాదేవి జాతీయస్థాయి బాక్సింగ్  పోటీలకు ఎంపికయ్యారని, వచ్చే నెలలో నేపాల్ లోని ఖాట్మండ్ లో జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. జాతీయస్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి విజయం సొంతం చేసుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామ్మూర్తి,  గైట్ పాలిటెక్నిక్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ పి.జి. రామానుజం, కోచ్ బి.సామ్యూల్ రాజ్, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు విజేతలను అభినందించారు.               

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us