TS News: ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. కవితతో పాటు కూచుకుల్లా దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ప్రొటెం చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రీ వీరిచే ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు కవిత, దామోదర్ రెడ్డిలకు మంత్రి మండలి రూల్స్ బుక్స్, ఐడి కార్డు అందజేశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us