Girl Raped : హైదరాబాద్ లో మరో దారుణం.. బాలికపై రెండు నెలలుగా ఐదుగురు అత్యాచారం

UPDATED 7th JUNE 2022 TUESDAY 07:50 AM

Five raped a girl : హైదరాబాద్ లో బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. నగరంలో వరుసగా దారుణాలు వెలుగుచూస్తున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు లైంగిక దాడులకు తెగబడుతున్నారు. మాయమాటలు చెప్పి ఒకడు, నమ్మించి మరొకడు, కిడ్నాప్ చేసి ఇంకొకడు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన, పాతబస్తీలో లైంగిక దాడులు, నెక్లెస్ రోడ్డు ఘటనలు మరువక ముందే.. నగరంలో మరో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. హైదరాబాద్ లో మరో దారుణం ఘటన వెలుగుచూసింది. సికింద్రాబాద్ కార్ఖానాలో బాలికపై రెండు నెలలుగా ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ధీరజ్, రితేశ్ అనే ఇద్దరు యువకులు ఓ బాలికతో పరిచయం పెంచుకున్నారు.

ఈ నేపథ్యంలో హోటల్ కు రప్పించి వీడియోలు తీస్తూ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడుతున్నారు.వీడియోలు ఇస్తానని బాలికను పిలిపించి స్నేహితులతో కలిసి ధీరజ్ గ్యాంగ్ రేప్ ఆమెపై అత్యాచారం చేశారు. రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్నా బాధితురాలు మాత్రం నోరు విప్పలేదు. అయితే సైక్రియాటిస్ట్ ముందు బాధితురాలు తన గోడు వెళ్లబోసుకుంది. బాలిక తల్లిదండ్రులు మే 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ తో పాటు మరో ఇద్దర్ని కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us