సేవా దృక్పధాన్ని అలవరచుకోవాలి

దివిలి (పెద్దాపురం) : విద్యార్థులు బాల్యం నుంచి సేవా దృక్పధాన్ని అలవరచుకోవాలని దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ స్వచ్చంద సేవ సంస్థ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రక్తదానంతోనే ప్రాణ దాతలు కావచ్చని ఆయన పేర్కొన్నారు.ఈ శిభిరం లో సుమారు 200 విద్యార్థులు రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ వైద్యులు డాక్టర్ వై. నాగేశ్వరావు సేవలందించారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ, ఏవో కేఆర్ సందీప్, ఏసీవో కే. పెదకాపు, ఎన్ ఎస్ఎస్ కోఆర్డినేటర్  ఎం. సత్తిబాబు, హెచ్ఓడీ వీరేంద్ర, అసిస్టెంట్ రాజీవముత్తు, రెడ్క్రోస్ సొసైటీ సిబ్బంది గౌతమీ, అన్నపూర్ణ, శ్రీకాంత్, అలీషా, విద్యార్థులు పాల్గొన్నారు.      

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us