ప్రజల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం

కలెక్టర్ హరికిరణ్

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ముఖ్యంగా భావి భారత పౌరులైన చిన్నారుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా స్వచ్ఛతా వాతావరణాన్ని పెంపొందించేందుకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇప్పటికే ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నా. కోవిడ్ మహమ్మారి విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో స్వచ్ఛత పరంగా మరిన్ని స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైన్లు చేపడుతున్నట్లు వివరించారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను కట్టడి చేయడంలో భాగంగా దోమల నియంత్రణకు జనావాసాలతో పాటు ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్లు తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. జిల్లాలో చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లో జిల్లా, డివిజనల్, మండలస్థాయి అధికారులు పాల్గొని, ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు తెలిపారు. విష జ్వరాల వ్యాప్తికి సీజన్ తో సంబంధం లేదని. వర్షం పడి తగ్గిన ప్రతిసారీ జ్వరాలు విజృంభించే అవకాశమున్నందున అలాంటి సమయాల్లో మరింత అప్రమత్తంగా ఉండి. దోమలు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us