జనం దీవెనలే జననేతకు అండ

* ప్రజా శ్రేయస్సే లక్ష్యం సమస్యలే అజెండా
* వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు నేటితో ఏడాది

UPDATED 6th NOVEMBER 2018 TUESDAY 8:00 PM

పెద్దాపురం: జనం కష్టసుఖాలను తెలుసుకోవడానికి, వారి సంక్షేమాన్ని విస్మరించిన పాలకులకు కనువిప్పు కల్గించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు మంగళవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా స్థానిక రామారావుపేటలోని వైభవ్ ఎస్టేట్స్ లో గల పార్టీ కార్యాలయంలో పెద్దాపురం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనం గుండె చప్పుడు వినాలి, వారిలో ఒకడిలా మెలగాలి, కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి, ఎన్ని కష్టాలు ఎదురైనా వారి కోసమే నిలబడాలి, ప్రాణాలు పణంగా పెట్టయినా ప్రజాశ్రేయస్సునే కాంక్షించాలి... ఇలాంటి లక్షణాలన్నీ ఉన్న నాయకులు అరుదుగానే ఉంటారని, అలాంటి అరుదైన నాయకుల్లో జగన్‌మోహన్‌రెడ్డి ఒకరని అన్నారు. ప్రజా సమస్యలే అజెండాగా ఆయన అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారని, ఎండనక, వాననక, అలుపెరుగక, జనమే కుటుంబంగా ప్రజాసమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రను చేపట్టారని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దవులూరి సుబ్బారావు, కాపుగంటి కామేశ్వరావు, గోలి వెంకట అప్పారావు చౌదరి, ఊబా జాన్ మోజెస్, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.             

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us