గ్యాస్ సిలిండర్ పేలింది

UPDATED 9TH MAY 2017 TUESDAY 7:00 AM

పెద్దాపురం : స్థానిక గౌరీ కోనేరు ప్రాంతంలో ఓ ఇంట్లో మంగళవారం తెల్లవారు జామున గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫైర్ ఆఫీసర్ మలకా నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం గొల్తి ప్రసాద్ కు చెందిన ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న కిరోసిన్ దీపం కారణంగా పాకకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సిలిండర్ మంటల వేడికి ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గెడ్డం బాబురావు, శివ, కృష్ణ, గొల్తి ఈశ్వరమ్మ, సతీష్, లక్ష్మి లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదఘటనలో సుమారు రూ. ఒక లక్ష ఆస్తి నష్టం సంభవించింది .  గాయపడ్డ క్షతగాత్రులను పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే రంగంపేట మండలం రామేశంపేటలో వంకా వెంకట్రాజు ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.1.10  లక్షలు ఆస్తి నష్టం సంభవించింది. ఇంట్లో అద్దెకి ఉంటున్న జోగీందర్ దాస్ వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.  సంఘటనా స్థలానికి పెద్దాపురం అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు.    

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us