మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

పెద్దాపురం : ప్రజల నుండి తరచు ఫిర్యాదులు రావడంతో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మునిసిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డిఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో మునిసిపల్ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టణంలో పలు అక్రమనిర్మాణాలకు సంబంధించి పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.ఈ తనిఖీల్లో ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎసైలతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ఏసీబీ అధికారుల తనిఖీల నేపథ్యంలో మునిసిపల్ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us