ఆదిత్య పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగాల వెల్లువ

UPDATED 28th APRIL 2018 SATURDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బెంగళూరుకు చెందిన ఆనంద్ గ్రూప్ కంపెనీకి 33 మంది, అలాగే చెన్నై కు చెందిన మాండొ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 20మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 27వ తేదీన బెంగూళూర్, చెన్నైకు చెందిన రెండు కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో తమ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించారని, ఎంపికైన అభ్యర్థులు బెంగూళూర్, చెన్నైలలో పనిచేయవలసి ఉంటుందని అన్నారు. ఆనంద్ గ్రూప్ కంపెనీకి ఎంపికైన వారికి నెలకు రూ.11500/- జీతంతో పాటు ఉచిత భోజన, వసతి సదుపాయాలు, మాండొ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎంపికైన వారికి రూ.11550/- వేతనంతో పాటు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్థాయని తెలిపారు. ఉద్యోగ అవకాశాలకై తీవ్రపోటీ ఎదుర్కొంటున్న నేటి పోటీ ప్రపంచంలో పాలిటెక్నిక్ పట్టాతో పాటు మంచి జీతంతో కూడిన మంచి కంపెనీలో ఉద్యోగ నియామక పత్రంతో ఆదిత్య విద్యార్థులు సగర్వముగా బయటకు అడుగుపెడుతున్నారని, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో సమానమైన ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాల కల్పన, అనుభవజ్ఞులైన అధ్యాపక సిబ్బంది, పోటీ పరీక్షలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మొదటి సంవత్సరం నుంచి ప్లేస్ మెంట్ విభాగం వారిచే సుశిక్షుతులైన 30మంది సిబ్బందిచే ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్ల విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందారని అన్నారు. విద్యార్థుల అభివృద్దే పరమావధిగా పనిచేసే అధ్యాపక సిబ్బంది కృషి వల్ల ఈ ఘనత సాధించామని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్. కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఎ. మాధవరావు, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు శుభాకాంక్షలు తెలియచేశారు..
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us