వైసీపీ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లే వారికి, నియోజకవర్గాల్లో దీటుగా పనిచేసే నాయకులకే భవిష్యత్తులో పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో ఇటీవల మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగ్గయ్యపేట పురపాలక సంఘాల నాయకులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన సమావేశమయ్యారు. కొండపల్లిలో పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులందరికీ పేరు పేరునా ఆయన అభినందనలు తెలిపారు. జగ్గయ్యపేటలో తెదేపా నైతికంగా గెలిచి, వైసీపీ అక్రమాలతో సాంకేతికంగా ఓడిపోయిందన్నారు. ‘‘కొన్ని నియోజకవర్గాల్లో సమర్థుల్ని ప్రోత్సహించకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఇకపై నియోజకవర్గ ఇన్‌ఛార్జి నుంచి ప్రతి స్థాయిలోను సమర్థులకే పెద్దపీట వేస్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘జగన్‌రెడ్డి కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి స్థానిక ఎన్నికలు నిర్వహించారు. వైకాపాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వారి వైఫల్యాల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. నాపైనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలి. రెండున్నరేళ్ల జగన్‌రెడ్డి పాలనలో అన్నీ అరాచకాలే’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘కొండపల్లి ఎన్నికల్లో ఎంపీ కేశినేని నాని నాయకులకు సరియైన దిశానిర్దేశం చేశారు. వైకాపా ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రజలు తెదేపాకి విజయం చేకూర్చారు. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా అదేవిధంగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. నాయకులెప్పుడూ ప్రజలతో మమేకమై ఉండాలి...’’ అని చంద్రబాబు చెప్పారు. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, చినరాజప్ప, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us