AP News: సీఎస్ సమీర్ శర్మపై ఆరోపణలను ఖండించిన ఐఏఎస్ అధికారులు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యల పై ఐఏఎస్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్ పై సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఐఏఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న తెలిపారు. పాలనా పరంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ సీఎస్ పరిపాలనా అధిపతి అని.. అన్ని సంఘాలు, ఉద్యోగుల పట్ల సీఎస్ బాధ్యతగానే వ్యవహరిస్తారని ప్రద్యుమ్న స్పష్టం చేశారు. వృత్తి పరంగా ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే విషయాన్ని ఉద్యోగులు తెలుసుకోవాలని హితవు పలికారు. సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సీఎస్ పై ఆరోపణలు చేయడం తగదన్నారు. బాధ్యతారాహిత్యంగా భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని ఆశిస్తున్నట్లు ప్రద్యుమ్న పేర్నొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us