Free Ration Scheme : పేదలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచిత రేషన్ పథకం మరో 6 నెలలు పొడిగింపు

UPDATED 26th MARCH 2022 SATURDAY 09:00 PM

Free Ration Scheme : పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రేషన్‌ పథకాన్ని పొడిగించింది. మరో ఆరు నెలలు ఈ స్కీమ్ అమలు కానుంది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో గతేడాది అమల్లోకి తీసుకొచ్చిన పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం గడువును మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కేబినెట్ భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.‘‘భారత దేశ బలం దేశంలోని ప్రతి పౌరుడి శక్తిలో ఉంది. ఈ శక్తిని మరింత బలోపేతం చేసేందుకు పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజనను మరో ఆరు నెలల పాటు అంటే సెప్టెంబర్‌ 2022 పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంతకు ముందులాగే 80 కోట్ల మందికి పైగా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు’’ అని ప్రధాని కోరారు.ఈ పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5కిలోల చొప్పున ఆహార ధాన్యాలను కేంద్రం పంపిణీ చేస్తోంది.

2020 ఏప్రిల్‌ నుంచి మొదలైన ఈ ఉచిత రేషన్‌ పంపిణీ పథకాన్ని కేంద్రం దశల వారీగా పొడిగిస్తూ వచ్చింది. మార్చి నెలాఖరుతో దీనికి గడువు ముగియనున్న వేళ శనివారం కేంద్ర కేబినెట్‌ భేటీ అనంతరం పీఎంజీకేఏవై పథకాన్ని మరోసారి పొడిగించాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us