TTD Jobs : టిటిడిలో కాంట్రాక్టు పోస్టుల భర్తీ

UPDATED 8th APRIL 2022 FRIDAY 02:20 PM

TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్ధానం అధ్యర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్ లో ఖాళీలను భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9ఖాళీలు భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి గోశాల మేనేజర్ 3 ఖాళీలు, డెయిరీ అసిస్టెంట్ 6ఖాళీలు ఉన్నాయి. గోశాల మేనేజర్ ఉద్యోగానికి సంబంధించి వెటర్నరీ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ. 54, 060 వేతనం చెల్లిస్తారు. డెయిరీ అస్టిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన పోస్టును అనుసరించి పదవతరగతి, రెండేళ్ల యానిమల్ హజ్బెండరీ పాలిటెక్నిక్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ. 29, 980 వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.

ధరఖాస్తులను పంపాల్సిన చిరునామా ; ది డైరెక్టర్, శ్రీ వెంకటేశ్వర కౌ ప్రొటెక్షన్ ట్రస్ట్, టిటిడి, చంద్రగిరి రోడ్, తిరుపతి-517502, ఆంద్రప్రదేశ్ చిరునామాకు పంపాలి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం https://www.tirumala.org/ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us