KCR, Uddhav: మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు భేటీ

UPDATED 20th FEBRUARY 2022 SUNDAY 06:00 AM

KCR,Uddhav: జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు బీజేపీయేతర పార్టీలు, ఇతర రాష్ట్రాల్లోని అధికార ప్రాంతీయ పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఈక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఆదివారం ముంబై బయలుదేరిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిసి..పలు అంశాలపైనా చర్చించనున్నారు.

బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై గతంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ ద్వారా పాక్షిక చర్చలు జరిపిన సీఎం కేసీఆర్ .. వారినెవరిని కలిసే ప్రయత్నం చేయలేదు. ఈవిషయంలో మొట్టమొదటిసారి మహారాష్ట్ర సీఎంతో చర్చలు జరిపేందుకు కేసీఆర్ స్వయంగా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us