భీమేశ్వరుని సన్నిధిలో ఎస్పీ పూజలు

UPDATED 23rd OCTOBER 2018 TUESDAY 10:00 PM

సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి సన్నిధిలో జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం రాత్రి ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ ఈవో పులి నారాయణమూర్తి, ధర్మకర్తల మండలి   సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉపాలయాలను, స్వామివారి మూలవిరాట్‌ను దర్శించుకుని గర్భాలయంలో అభిషేకాలు చేశారు. అనంతరం బాలాత్రిపురసుందరి అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేశారు. ఆలయ నంది మండపంలో ఎస్పీ కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదస్వస్థిచేసి ఆశీర్వచనం పలికారు. ఎస్పీ వెంట పెద్దాపురం సీఐ జి. యువకుమార్‌, సామర్లకోట ఎస్సై ఎల్. శ్రీనివాస్‌ నాయక్, ఏఎస్సై వెంకటేశ్వరావు, తదితరులు ఉన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us