వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

UPDATED 25th MARCH 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ నాయకులు సోమవారం ప్రారంభించారు. స్థానిక పిఠాపురం రోడ్డులోని పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద గల ముత్యం రాజబాబు స్థలంలో కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కళకళలాడిన రాష్ట్రాన్ని ఇప్పుడు చూస్తే ఎంతో బాధేస్తోందని అన్నారు. రుణమాఫీ జరగక, గిట్టుబాటు ధరలు లేక రైతులు, ఉద్యోగ అవకాశాలు లేక యువత, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు రావాలంటే జగనన్నపాలన రావాల్సిన అవసరం ఉందని, జగనన్నకు ఒక్కసారి అవకాశమిస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మట్టపల్లి రమేష్, మద్దాల శ్రీను, ఆవాల లక్ష్మీనారాయణ, తోట రవి, ముత్యం రాజుబాబు, మసకపల్లి సత్యనారాయణ, శెట్టిబత్తుల దుర్గ, భావన్నారాయణ, సల్లూరి కల్యాణ్, ఊబా జాన్ మోజస్, గోలి వెంకట అప్పారావు చౌదరి, నేతల హరిబాబు, జుత్తుక అప్పారావు, సేపేని సురేష్, వర్రే రవి, చిట్టూరి లక్ష్మణరావు, సుంకరపల్లి సత్తిబాబు, ఎలిజిబెత్ రాణి, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us