ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

* జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి

UPDATED 10th SEPTEMBER 2020 THURSDAY 7:00 PM

కాకినాడ (రెడ్  బీ న్యూస్): జిల్లాలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నా ప్రజలెవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రజలందరికీ భరోసా కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సర్జికల్ వార్డులో పోలీసు, పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్లను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) జి. రాజకుమారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఆసుపత్రులు ప్రత్యేకంగా కోవిడ్ ఆసుపత్రులలో ఐసియూ, ఆక్సిజన్ పడకలు, మందులు సరఫరా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, అలాగే ఆసుపత్రుల్లో వైద్య, ఇతర పారా మెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. కోవిడ్ ప్రారంభమైన నాటి నుంచి నిరంతరం సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బందికి ఆక్సిజన్ తో కూడిన 30 పడకల ప్రత్యేక వార్డు, అక్రిడేషన్ గల పాత్రికేయుల కోసం ఆక్సిజన్ తో కూడిన 12 పడకలను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు అనవసరంగా కొవిడ్ బారినపడకుండా ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాఘవేంద్రరావు, ఆర్ఎంఓ డాక్టర్ గిరిధర్, సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ రాజేశ్వరి, దిశ వన్ స్టాప్ సెంటర్ ఏఎస్ఐ కె.ఎస్. చందన, తదితరులు పాల్గొన్నారు.
                

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us