జాతీయ నూతన విద్యా విధానంపై వెబినార్

UPDATED 2nd OCTOBER 2020 9:00 PM

గోకవరం (రెడ్ బీ న్యూస్): జాతీయ నూతన విద్యా విధానం-2020పై ఈనెల 4వ తేదీన వెబినార్ నిర్వహిస్తున్నట్లు ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మన్ పి. కనకరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన విద్యా విధానం, భవిష్యత్ తరాలకు అనుగుణంగా అత్యున్నత ప్రయోజనాత్మక పాఠ్య ప్రణాళిక ఏ విధంగా మార్చడం జరిగింది, ప్రపంచ దేశాల్లో ఉన్న నూతన విద్యా విధానానికి అనుగుణంగా మన ప్రభుత్వం తీసుకున్న మార్పులు, తదితర అంశాలపై జాతీయ గ్రామీణ, పంచాయతీ రాజ్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ టి. విజయ్ కుమార్ తెలియచేస్తారని అన్నారు. రాష్ట్ర  ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి ప్రారంభించే ఈ వెబినార్ ను జూమ్, యూట్యూబ్ లింక్ ద్వారా వీక్షించవచ్చని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ ఫణి కుమార్, కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఏవో శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us