ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో గణాంక ప్యాకేజీ కార్యక్రమం

UPDATED 4th JUNE 2018 MONDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో సాంఘిక శాస్త్రాల కోసం గణాంక ప్యాకేజీ (statistical package for the social sciences) కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ బి. మునుస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనదేశంలో మొదటిసారిగా 2009వ సంవత్సరంలో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఐబీఎం ప్రతినిధులు ఈ గణాంకాల ప్యాకేజీని ఉపయోగించారని, దీని ద్వారా సమర్థవంతమైన సమాచార నిర్వహణ, విస్తృతశ్రేణి ఎంపికలు, మంచి ఫలితాలు సాధించడమే కాకుండా, సంస్థ సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అనంతరం ముఖ్య అతిథిని జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us