ప్రగతిలో ముగిసిన ఎన్.సి.సి శిక్షణా శిబిరం

UPDATED 31st MAY 2018 THURSDAY 6:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో గత పది  రోజులుగా కాకినాడ 18వ ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్.సి.సి శిక్షణా శిబిరం గురువారం ముగిసింది. వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన 600 మంది ఎన్.సి.సి విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్న ఈ శిబిరంలో విద్యార్థులు రక్షణ విభాగంలో సేవలు అందించడానికి, సమాజ సేవాస్ఫూర్తిని పెంపొందించుకోవడానికి కావలసిన క్రమశిక్షణను అలవర్చుకున్నారు. కమాండింగ్ ఆఫీస్ కల్నల్ మోనిషా గౌర్, డెప్యూటీ కమాండింగ్ ఆఫీస్ లెఫ్టినంట్ కల్నల్ బి. సత్యనారాయణ, గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్(కాకినాడ) కల్నల్ సి.ఎస్. నాయుడు, సీనియర్ ఎన్.సి.సి ఆఫీసర్స్ పాల్గొని విద్యార్థుల భవిష్యత్ సూచికను, రక్షణ విభాగం, సమాజంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్.సి.సి శిక్షణా శిబిరం తమ కళాశాలలో నిర్వహించినందుకు ఎన్.సి.సి విభాగాన్ని అభినందించారు. విద్యార్థినీ, విద్యారుల్లో క్రమశిక్షణ ఎన్.సి.సితో వస్తుందని, మనదేశంలో ఎన్.సి.సి ఒక ప్రధాన భాగం అయిందని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్  ఎస్. శంభూప్రసాద్ ఎస్.సి.సి క్యాడెట్ గా, ఆఫీసర్ గా తన గత అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ శిక్షణ శిబిరానికి కళాశాల ఎన్.సి.సి ఆఫీసర్ లెఫ్టినంట్ జె.డి. నాయుడు ఆర్గనైజర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్మంట్ ఎమ్.వి. హరనాధబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురామ్, వైస్ ప్రెసిడెంట్ ఎమ్. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us