UPDATED 20th JULY 2022 WEDNESDAY 02:15 PM
CPI narayana: సినీనటుడు చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ… తన వ్యాఖ్యను భాషా దోషంగా భావించాలని అన్నారు.
చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెప్పారు. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలను ఇంతటితో మరిచిపోండని ఆయన వ్యాఖ్యానించారు. చిరంజీవి కుటుంబంతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని చెప్పారు. కాగా, భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని పిలవడంపై నారాయణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
విగ్రహావిష్కరణకు అల్లూరి సీతారామరాజు సినిమాలో హీరోగా నటించిన సూపర్ స్టార్ కృష్ణను ఆహ్వానించకుండా ఏపీ సర్కారు చిరంజీవిని పిలవడం ఏంటని నారాయణ అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలపై జనసేన నేత నాగబాబు మండిపడ్డారు. కొందరు చేసిన తెలివి తక్కువ వ్యాఖ్యలపై జనసైనికులు, అభిమానులు మండిపడుతున్నారని అన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి, ఎండు గడ్డి, చెత్త తింటున్నారంటూ నాగబాబు మండిపడ్డారు.