రవితేజ మూవీ రీమేక్‌కు ఫుల్ డిమాండ్..!

UPDATED 25th SEPTEMBER 2017 MONDAY 10:30 PM

టాలీవుడ్ యాక్టర్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టైటిల్ సాంగ్‌కు ఆడియెన్స్ నుంచి అద్బుతమైన రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రవితేజ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. రాజా ది గ్రేట్ హిందీ రీమేక్ హక్కులు రూ. 18 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో రవితేజకు జోడీగా మెహరీన్ నటిస్తూంది. తాజా ప్రాజెక్టులో రవితేజ కుమారుడు మహాధన్‌కు కూడా సిల్వర్‌స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us