CM KCR: వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే.. 95 నుంచి 105 సీట్లు మావే-కేసీఆర్

Updated 1 February 2022 Tuesday 09:00 PM

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): వచ్చే ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వంద శాతం టీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. 95 నుంచి 105 సీట్లు టీఆర్ఎస్ గెలువబోతోందని అన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందే ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామన్నారు. ఎన్నికల్లో ఎలా గెలవాలో మాకు తెలుసు అన్న కేసీఆర్, మా దగ్గర మంత్రం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ లో కొత్త రాజ్యాంగం కావాలన్న కేసీఆర్, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు.

దేశంలో గుణాత్మకమైన, పరివర్తన మార్పు కోసం ఫైట్ చేస్తామని కేసీఆర్ అన్నారు. దేశానికి కొత్త ఎజెండా సెట్ కావాలన్నారు. దేశ యువతను జాగృతం చేస్తామని చెప్పారు. భవిష్యత్ కోసం రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లతో హైదరాబాద్ లో సమావేశం నిర్వహిస్తామన్నారు. రోడ్ మ్యాప్ తయారు చేసి ప్రకటిస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పారు కేసీఆర్.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కేసీఆర్ సూటిగా సవాల్ విసిరారు. అభివృద్ధిపై టీవీ-బహిరంగ చర్చకు తాను సిద్ధమన్న కేసీఆర్…. మీరు సిద్ధమేనా? అని బీజేపీని చాలెంజ్ చేశారు. దేశ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. మోదీ పాలన వల్ల ఏ వర్గం అభివృద్ధి చెందింది? అని అడిగారు.

కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం దేశ వాతావరణాన్ని చెడగొడుతోందన్నారు. తెలంగాణ, హైదరాబాద్ లో మంచి ఎకో ఉందని, ఫలితంగా పెట్టుబడులు వస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రాన్ని చెడగొడతామంటే ఊరుకునేది లేదన్నారు. సోషల్ మీడియా పేరుతో తప్పుడు ప్రచారాలు చేస్తే సైలెంట్ గా ఉండేది లేదన్నారు. దళితబంధు పథకం మీకు కనపడటం లేదా? దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం కాదా? సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోవాలా? అని కేసీఆర్ ఫైర్ అయ్యారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us