ప్రైవేట్ వైద్యులు సేవాదృక్పథంతో సేవలందించాలి

* జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి

UPDATED 14th JULY 2020 TUESDAY 6:30 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలో కరోనా కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రైవేట్ వైద్యులు సేవా దృక్పధంతో తమ సేవలను అందించాలని జిల్లా కలక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు, నర్సింగ్ అసోసియేషన్ సభ్యులు, ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వివిధ విభాగాల అధిపతులతో స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో జిల్లా కలక్టర్ మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) జి. రాజకుమారితో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ కోవిడ్ విధులు నిర్వహించే వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి కరోనా వైరస్ వ్యాధి సోకితే వారి కోసం ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్ కేసు నమోదైతే  ఆసుపత్రి మూసివేయడం, వైద్యులు విధులకు దూరంగా ఉండడం సరికాదని, జిల్లాలో కోవిడ్ మరణాల శాతం తగ్గించే విధంగా వైద్యులు కృషి చేయాలన్నారు. ఆసుపత్రికి వచ్చిన వ్యాధిగ్రస్తులకు వెంటనే ఆక్సిజన్, ఇతర అత్యవసర సేవలు అందించాలని, అలాగే వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వారిని హోం ఐసోలేషన్ లో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి యాజమాన్యాలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాఘవేంద్రరావు, రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్  డాక్టర్ బాబ్ది, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ మణిరత్నకిషోర్, 4జీహెచ్ కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ ఎం. కిరణ్, ఆర్ఎంవో డాక్టర్ పద్మ శశిధర్, కాకినాడ ఐఎంఎ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వాడ్రేపు రవి, ప్రైవేట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఎస్.మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us