హనుమంత ... పులకింత

ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 27 అక్టోబర్ 2021: వేంకటాద్రిరాయుడు హనుమంత వాహనంపై ఊరేగారు. త్రేతాయుగం నాటి శ్రీరాముడిని నేనేనంటూ భక్తులకు దర్శనమిచ్చారు. కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం అనన్య భక్తుడైన హనుమంతు వాహన సేవలో స్వామి వారు భక్తులను కటాక్షించారు. లోకహితార్థం కృతయుగంలో నృసింహ స్వామిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో వేంకటేశ్వరుడిగా స్వామి అవతరించారు. ఆ సందేశాన్ని చాటుతూ వాడపల్లి తిరువీధుల్లో హనుమంత వాహనసేవ రామరాజ్య వైభవాన్ని సాక్షాత్కిరింపజేసింది. పండితుడు ఖండవిల్లి రాజేశ్వరవరప్రసాదాచార్యులు నేతృత్వంలో ఉదయం శాస్త్రోక్తంగా అష్టోత్తర శతకలశాభిషేకం, కుంభపూజ, లక్ష తులసి పూజ, నవగ్రహ హోమం జరిగాయి. దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఉమాదేవి దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us