అంబాజీపేట (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022: కోనసీమలో ప్రభలతీర్థం మహోత్సవం వైభవంగా జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభలతీర్థ మహోత్సవాన్ని గత 420 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. మహోత్సవంలో భాగంగా జగ్గన్నతోటలో ఏకాదశ రుద్రుల ప్రభలు ఏర్పాటు చేశారు. వాకలగరువు, తొండపూడిలో రాష్ట్రంలోనే ఎత్తైన ప్రభలు ఏర్పాటు చేశారు. ప్రభల మహోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ మహోత్సవాల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు.