దళితవాడల అభివృద్దే టిడిపి ప్రభుత్వ లక్ష్యం

UPDATED 10th MARCH 2018 SATURDAY 7:00 PM

పెద్దాపురం: దళితవాడల అభివృద్ధే టిడిపి ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,  హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో మండల సర్పంచ్ ల సమాఖ్య అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి) ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత తేజం కార్యక్రమంలో ఆయన శనివారం పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా దళితుల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యం అని చెప్పారు. అనంతరం ప్రజల నుంచి సమస్యలు ఆడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కమ్మిల సుబ్బారావు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, తిరుపతి సర్పంచ్ మొయిళ్ళ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us