రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత జగన్‌కు లేదు: రాజప్ప

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 22 నవంబరు 2021: రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ముఖ్యమంత్రి జగన్‌కు లేదని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శాసనసభలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమానపరిచే విధంగా వైసీపీ నాయకులు విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ ఆయన టీడీపీ శ్రేణులతో కలసి సోమవారం పట్టణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘వైసీపీ అధికారం చేట్టిన తరువాత రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని, మాట తప్పను మడమ తిప్పను అని ప్రగల్భాలు పలికిన సీఎం ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు మేధావులు సైతం ముఖ్యమంత్రి తీరును విమర్శిస్తున్నారన్నారు. ప్రజలు ఛీకొడుతుండడంతో వైసీపీ నాయకులు మాట మారుస్తున్నారన్నారని, అసెంబ్లీలో జరిగిన సంభాషణలను కట్‌ చేయకుండా బయటకు విడుదల చేయాలి’’ అని రాజప్ప డిమాండ్‌ చేశారు.  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us