Acharya: 'ఆచార్య' సినిమా విడుదల వాయిదా

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022: కరోనా ఉద్ధృతి దృష్ట్యా పెద్ద సినిమాల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు వాయిదా పడ్డాయి. ఆచార్య కూడా అదే బాటలో వెళ్లింది. అగ్రకథానాయకుడు చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా ఉద్ధృతి దృష్ట్యా సినిమాను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే 'ఆచార్య' విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో చిరుకు జోడీగా కాజల్, చరణ్ సరసన పూజా హెగ్డే కనిపిస్తుంది. మణిశర్మ స్వరాలందిస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us