UPDATED 19th APRIL 2022 TUESDAY 11:30 AM
Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ గతేడాదే రిలీజ్ కావాల్సి ఉన్నా, కరోనా నేపథ్యంలో ఈ సినిమాను చిత్ర యూనిట్ వాయిదా వేస్తూ వచ్చారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తవ్వడంతో ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఏప్రిల్ 29న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని ఆచార్య టీమ్ ఫిక్స్ అయ్యింది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్.ఇందులో భాగంగా ఈ సినిమా నుండి ‘భలే భలే బంజారా’ అనే లిరికల్ సాంగ్’ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ అందించగా, మణిశర్మ ట్యూన్స్ కంపోజ్ చేశాడు. ఈ పాటను శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాడారు. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి డ్యాన్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఈ పాటకు బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ను అందిస్తున్నారు.
ఈ పాట రిలీజ్ అయిన కొన్ని గంటల్లోలనే యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భలే భలే బంజారా పాటకు ఏకంగా 6 మిలియన్ల కంటే ఎక్కువగా వ్యూస్ రాగా ఈ పాటలో చిరంజీవి, చరణ్‌ల డ్యాన్స్ స్టెప్పులు మెగా ఫ్యాన్స్‌కు మంచి కిక్కిస్తున్నాయి.చాలా రోజుల తరువాత చిరంజీవి నుండి ఈ తరహా డ్యాన్స్ స్టెప్పులు చూశామంటూ మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తనదైన మార్క్ టేకింగ్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దగా, ఈ సినిమా కోసం ఆయన ఓ పవర్ఫుల్ కథను రెడీ చేసినట్లు ఈ చిత్ర ట్రైలర్లోనే మనకు చెప్పేశారు.
సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డేలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఆచార్య ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.