ఆదిత్య ఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వనం-మనం

UPDATED 19th JULY 2018 THURSDAY 6:30 PM

గండేపల్లి: మిషన్ హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, గ్రామాలలో పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. వనం-మనం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కోటి మొక్కలు నాటాలని నిర్ణయించారు. పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, చెరువులు, పొలంగట్లు, రహదారులకు ఇరువైపులా, ప్రభుత్వ బంజరు భూముల్లో మొక్కలు పెంపకం కోసం ఏటా జులై నెలలో వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో గురువారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ ప్రారంభించి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతీ ఒక్కరూ ఒక మొక్కను నాటి దానిని  సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఎం. సోమిరెడ్డి, జె. బాలమోహన్ రాజు, వాలంటీర్లు పాల్గొన్నారు. 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us