అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 142ను సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం... కౌంటర్లు దాఖలు చేయాలని హోంశాఖ కార్యదర్శి, న్యాయశాఖ. ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.