ఆదిత్య ప్రొఫెసర్ హరణికి డాక్టరేట్

UPDATED 16th AUGUST 2018 THURSDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గల ఆదిత్య ఫార్మసీ కళాశాలకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ఎ. హరణి ఆంధ్రాయూనివర్సిటీ (విశాఖపట్నం) నుంచి పి.హెచ్.డి పట్టా డాక్టరేట్ పొందినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంస్థకు చెందిన ఫార్మసీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా 2011లో చేరిన హరణి  క్రమశిక్షణతో కృషి, పట్టుదలతో అసోసియేట్ ప్రొఫెసరుగా ఎదిగి అత్యుత్తమ సేవలందిస్తూ నిరంతర కృషితో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారన్నారు. ఆమె సమర్పించిన "ASENAPINE MALEATE LOADED SELF EMULSIFYING SYSTEMS AND SELF EMULSIFYING PHOSPHOLIPID COMPLEXES - STRATEGIESTO IMPROVEORAL BIO AVAILABILITY" అనే సిద్ధాంత వ్యాసంకు ఈ డాక్టరేట్ పొందారని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా డాక్టర్ హరణిని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వై. సురేంద్రనాథ్ రెడ్డి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు అభినందించారు. 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us