Encounter: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌: ముగ్గురు ఉగ్రవాదులహతం

శ్రీనగర్ (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 ‌: జమ్ము కశ్మీర్‌లో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారని శుక్రవారం పోలీసులు వెల్లడించారు. బుద్గామ్‌ జిల్లా జోల్వా గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో మూడు ఏకే 56 రైఫిల్స్‌, ఇతర ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్‌ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. మృతి చెందిన ఉగ్రవాదుల్లో ఒకరిని శ్రీనగర్‌కు చెందిన వసీమ్‌గా గుర్తించినట్లు, మరో ఇద్దరి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మొదటి వారంలో 16 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us