ఆదిత్యలో ఎంబిఎపై అవగాహన సదస్సు

UPDATED 16th JULY 2018 MONDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఎంబిఎ ఒక వృత్తి విద్యా కోర్సు అనే అంశంపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కాకినాడకు చెందిన ఎక్సెల్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు ఎస్. రామకృష్ణ హాజరై విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు వివరించారు. డిగ్రీ చదువుచున్న విద్యార్థులు తమ ఉన్నత చదువులు దేశంలో గల ప్రముఖ యూనివర్సిటీలలో అభ్యసించేందుకు కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరచాలని, అందుకు నిర్దిష్ట ప్రణాళికతో చదవడమే కాకుండా సరైన శిక్షణ కూడా ఎంతో అవసరమని తెలిపారు. మంచి ప్రతిభ కనబరిచి అత్యున్నత యూనివర్సిటీలలో చదివిన వారు మంచి కంపెనీలలో ఉద్యోగాలు పొంది ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని అన్నారు. బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ విద్యార్థులకు క్యాట్ కు సన్నధం అయ్యేవిధంగా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే  ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ విద్యార్ధులు ప్రారంభం నుంచి నిర్దిష్టమైన ప్రణాళికతో కష్టపడి చదవాలని, అంతేకాక ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us