హత్య కేసు మిస్టరీ వీడింది

Updated 24th April 2017 Monday 7:30 PM

పెద్దాపురం: పెద్దాపురం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన ప్రైవేటు కాంట్రాక్టర్ బఱ్ఱె శ్రీనివాస్ మృతి కేసుకు సంబందించిన మిస్టరీ వీడింది. ఈ మేరకు ముద్దాయిలను సోమవారం పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో మీడియా ఎదుట హాజరుపరిచారు. అడిషనల్ ఎస్ పి  ఆర్. దామోదర్ ఈ హత్యకు సంబందించిన వివరాలను మీడియాకు తెలియచేసారు. ఈ నెల 12  వ తేదీ రాత్రి గోరింట పులిమేరు ప్రధాన రహదారిలో శ్రీనివాస్ ను  పధకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. పాత కక్షలను దృష్టి లో ఉంచుకుని శ్రీనివాస్ ను అదే గ్రామానికి చెందిన బండి మహేష్ కుమార్, కొమ్మిరెడ్డి వరహాల కొండలరావు(బుజ్జి), కందుకూరి నాగేంద్ర, కందుకూరి శ్రీను, సమ్మిటి సూర్య గంగాధర్ లు శ్రీనివాస్ ను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో  శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తెంబూరు గ్రామానికి చెందిన మామిడి ధనుంజయరావుతో శ్రీనివాస్ ను హత్య చేసేందుకు రూ. మూడు లక్షలకు కిరాయి కుదుర్చుకుని అడ్వాన్స్ గా రూ. ముప్పై వేలు చెల్లించారు. దీంతో 12  వ తేదీ రాత్రి కాకినాడలో బంధువుల ఇంట పెళ్ళికి హాజరై తిరిగి స్వగ్రామం తిరిగి వస్తున్న శ్రీనివాస్ ను వెంబడించి వీరంతా కలిసి తుపాకి తో తల వెనుక భాగంలో ఒక రౌండ్   కాల్చడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు హత్యకు పాల్పడిన ముద్దాయిలు తాటిపర్తి విఆర్వో ఎదుట  సోమవారం లొంగిపోయారు. హత్యకు ఉపయోగించిన తుపాకి, నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఎస్. రాజశేఖరరావు, సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్ ఐ ఎ. కృష్ణ భగవాన్, అడిషనల్ ఎస్ ఐ ఏసుబాబు, సిబ్బంది పివిఎస్ కుమార్, వై.కృష్ణ, వి.విజయబాబు, ఐ. గణేష్, కె.జయకుమార్, నలమాటి శ్రీనివాసరావు, ఎం ఎస్ బి  విజయ్  తదితరులు పాల్గొన్నారు.     

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us