UPDATED 22nd MARCH 2022 TUESDAY 09:00 PM
Special Status : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి కేంద్రం తేల్చిచెప్పింది. లోక్సభలో వైసీపీ ఎంపీ సత్యనారాయణ ప్రశ్నకు కేంద్రం జవాబు ఇచ్చింది. ప్రత్యేక హోదాపై 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 32% నుంచి 42 శాతానికి పెంచామన్నారు. ఏపీ విభజన చట్టంలోని చాలా హామీలు నెరవేర్చామని నిత్యానందరాయ్ పేర్కొన్నారు.