Allu Arha : ‘కచ్చా బాదమ్’ పాటకి అల్లు అర్హ క్యూట్ స్టెప్స్.. మై లిటిల్ బాదం అంటూ షేర్ చేసిన బన్నీ

Allu Arha: ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ లో ‘కచ్చా బాదమ్’ అనే సాంగ్ బాగా వైరల్ అయింది. కొన్ని వారాలుగా ఈ పాట ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఇది ఇంకా వైరల్ అవుతూనే ఉంది. ఇన్ స్టా రీల్స్ తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా కచ్చా బాదం సాంగ్ వైరల్ అవుతుంది.

ఈ కచ్చా బాదం సాంగ్ కి వేసిన స్టెప్, ఆ మ్యూజిక్ కూడా బాగా వైరల్ అవ్వడంతో ఆ సాంగ్ కి అదే స్టెప్పు వేస్తూ అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ నెటిజన్లు అంతా దానికి డ్యాన్స్ చేస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా, మాములు జనాలు, సెలబ్రిటీలు అని తేడా లేకుండా అంతా ఈ పాటలు కాలు కదులుపుతున్నారు. కాలు మాత్రమే కాదు ఇది చేసే ట్రెండింగ్ కి బాడీ మొత్తం షేక్ చేసేస్తున్నారు.

తాజాగా ఈ పాటకి బన్నీ ముద్దుల కూతురు అల్లు అర్హ స్టెప్పులేసింది. కచ్చా బాదం సాంగ్ కి అల్లు అర్హ చాలా క్యూట్ గా అందరూ వేసే స్టెప్స్ అలాగే వేసేసింది. అల్లు అర్హ వేసిన ఈ డ్యాన్స్ ని వీడియో తీసి తన సోషల్ మీడియాలోపోస్ట్ చేశాడు అల్లు అర్జున్. ఆ వీడియో షేర్ చేసి.. మై లిటిల్ బాదం అర్హ అంటూ పోస్ట్ పెట్టాడు. అర్హ క్యూట్ గా డ్యాన్స్ చేయడంతో అంతా అర్హని అభినందిస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాటతో పాటు అర్హ వేసిన స్టెప్పులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us