UPDATED 23rd FEBRUARY 2022 WEDNESDAY 08:00 AM
కర్నూలు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వార్లకు బృంగి వాహనసేవ నిర్వహించారు. సాయంత్రం శ్రీశైలం పురవీధులలో బృంగి వాహనంపై స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం చేపట్టనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్నారు.