మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

UPDATED 22nd JANUARY 2017 MONDAY 7:00 PM

పెద్దాపురం : మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక షేక్ మదీనా పాచ్చా ఔలియా ఉరుస్ గంధోత్సవం ముగింపురోజైన సోమవారం మంత్రి దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ దర్గాకు ఎప్.డి.ఎప్, సాధారణ నిధులు రూ.8.80 లక్షలుతో అధునాతన షెడ్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జనవరి 20వ తేదీన జరిగిన ఉరుస్ గంధోత్సవంలో అధికసంఖ్యలో మతాలకతీతంగా భక్తులు పాల్గోవడం విశేషమన్నారు. మతసామరస్యానికి ఈ దర్గా ప్రతీకన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, గుడా సభ్యుడు ఎలిశెట్టి నాని, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, దర్గా ప్రెసిడెంట్ ఎం.డి.లాయక్ ఆలీ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, తెలుగుదేశం పట్టణ కార్యదర్శి తూతిక రాజు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.        
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us