అవినీతిరహితంగా విధులు నిర్వర్తించాలి:విజిలెన్స్ డీఎస్పీ రామచంద్రరావు

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 28 ఆక్టోబర్ 2021: అవినీతి రహితంగా ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తించి సభ్య సమాజానికి పౌరసేవలు పారదర్శకంగా అందించాలని రాజమండ్రి విజిలెన్స్ డీఎస్పీ రామచందర్రావు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశమందిరంలో పట్టణానికి చెందిన సచివాలయాల ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులతో స్వతంత్ర భారతం సమగ్రతతో కూడిన స్వావలంబన అవగాహన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ డీఎస్పీ రామచంద్రరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగులను సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ద్వారా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఈ సంవత్సరం అక్టోబర్ 26 నుంచి వారం రోజులపాటు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి తద్వారా ప్రజలకు విజిలెన్స్ అంశాలపై చైతన్యం పరుస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన ఈ వారోత్సవాలు వారం రోజుల పాటు అవగాహన వారోత్సవాలుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ విధులు సక్రమంగా విధులు నిర్వర్తించాలని విధులలో ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలని తెలిపారు. నిర్ణీత సమయంలో ప్రజల సేవలను పూర్తిచేయాలని తెలిపారు. జాబ్ చార్ట్, సిటిజన్ చార్ట్ అనేవి విజిలెన్స్ లో భాగమేనని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి వారి యొక్క విధులు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించాలే, తప్ప సొంత నిర్ణయాలతో విధులు నిర్వర్తించడం విజిలెన్స్ పరిధిలోకి వస్తుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఆస్తులను కాపాడడం ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతని, ఈ అంశం కూడా విజిలెన్స్ లో భాగంగా తెలిపారు. మీడియాలో ప్రభుత్వ పథకాలు అమలులో అక్రమాలను బహిర్గతం చేయడం వంటి వాటిపై కూడా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ యాక్షన్ ఉంటుందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారి విధుల పట్ల పరిజ్ఞానాన్ని పెంచుకొని అప్రమత్తంగా విధులు నిర్వర్తించడం ద్వారా వారికి, శాఖకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని డీఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రేంజ్ ఇనస్పెక్టర్లు పుల్లారావు, వాసు కృష్ణ, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర తదితరులు విజిలెన్స్ విభాగానికి సంబంధించిన అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ముందు స్వతంత్ర భారతం సమగ్రతతో కూడిన స్వావలంబన పై ఉద్యోగులతో విజిలెన్స్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us