భీమేశ్వరస్వామి హుండీ ఆదాయం లెక్కింపు

UPDATED 10th DECEMBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి కార్తీకమాసంలో రూ.
37,07,034 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో పులి నారాయణమూర్తి తెలిపారు. సోమవారం హుండీల్లో ఆదాయం లెక్కింపు కార్యక్రమం జరిగింది. గత నెల ఎనిమిదవ తేదీ నుంచి ఈనెల తొమ్మిదవ  తేదీ వరకు ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలు నిర్వహించగా పూజా రుసుముల ద్వారా రూ. 13,34,340, లక్షపత్రి పూజల ద్వారా రూ 55,500, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.5.5 లక్షలు, భక్తుల ప్రసాదం ద్వారా రూ 8,150, మనీఆర్డర్ ల ద్వారా రూ.765, పుస్తకాలు, ఫోటోలు విక్రయం ద్వారా రూ.9,965, ఇతర ఆదాయాలు రూ.25వేలు, హుండీల ద్వారా రూ.16.88 లక్షలు లభించినట్లు ఈవో  తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో కాకినాడ అన్నదాన సత్రం ఈవో బళ్లా నీలకంఠం, ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే జగదీష్ మోహన్, సభ్యులు పడాల వీరబాబు, దూది రాజు, బాడితమాని త్రిమూర్తులు, భక్త సంఘం సభ్యులు గంజి బూరయ్య, బిక్కిన పరమేశ్వర సాయి, తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది రూ.32,83,460 ఆదాయం రాగా ఈ సంవత్సరం సుమారు రూ.5 లక్షల ఆదాయం పెరిగినట్లు ఈవో తెలిపారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us